IND vs AFG | ఆఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా(Team India) పరుగుల వరద సృష్టించింది. టాస్ గెలిచిన ఆఫ్గానిస్థాన్ ఇండియాను బ్యాంటింగ్‌కు ఆహ్వానిచింది. శుభ్‌మన్ గిల్( 54), ఇషాన్ కిషన్(125) సెంచరీలతో చేలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) త్వరగా అవుటయినప్పటికి కెప్టెన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
హిట్ మ్యాన్ రోహిత్ ఆఫ్ సెంచరీకి చేరువులో (48) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో అడుగుపెట్టిన ఇషాన్ తన ఇన్సింగ్స్‌ను నెమ్మదిగా ఆరభించినా అర్ద సెంచరీ తర్వాత గేర్ మార్చి ఫోర్లు, సిక్సర్లతో ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కుల చూపాడు. కిషన్ సెంచరీలో 14 ఫోర్లు, 7సిక్స్‌లు ఉన్నాయి. గిల్, ఇషాన్ మూడో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కేఎల్ రాహుల్ డౌకౌట్ అవగా శ్రేయాస్ అయ్యర్(26), వాషింగ్టన్ సుందర్(19) పరుగులు చేశారు. ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో నంగేలియా 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు ఘజన్ఫర్, మహ్మద్ సలీం తలా ఒక వికెట్ పడొగొట్టారు. కాగా, వన్డేల్లో గిల్ 9వ సెంచరీ నమోదు చేయగా, ఇషాన్ కిషన్ రెండో సెంచరీ చేశాడు. ఆ ఇద్దరు బ్యాటర్లు ఓకే ఓవర్లో సెంచరీలు కొట్టడం విశేషం. గిల్ సెంచరీలో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
India vs Afghanistan