టీ20లో టీమ్ఇండియా టాప్
- టెస్టుల్లో రెండు.. వన్డేల్లో నాలుగో ర్యాంకు
- ఐసీసీ వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: పొట్టి ఫార్మాట్లో భారత్ సత్తాచాటింది. ఐసీసీ బుధవారం విడుదల చేసిన 2021-22 సీజన్ వార్షిక ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా టీ20 ఫార్మాట్లో అగ్రస్థానాన్ని అధిష్టించింది. టెస్టుల్లో రెండో ర్యాంక్‌కు చేరగా.. వన్డేల్లో మాత్రం నాలుగో ర్యాంక్‌కు పరిమితమైంది. ఈ ఏడాది మే 4 వరకు జరిగిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 30 టీ20 మ్యాచ్‌లాడిన భారత్ 8,093 పాయింట్లు, 270 రేటింగ్‌తో పొట్టి ఫార్మాట్లో మొదటి ర్యాంకును ఆక్రమించింది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, పాకిస్థాన్ నిలిచాయి. టెస్టుల్లో 23 మ్యాచ్‌లు ఆడి.. 2,736 పాయింట్లతో 119 రేటింగ్‌తో భారత్ ద్వితీయ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (128 రేటింగ్‌తో) అగ్రస్థానంలో నిలిచింది. వన్డేల్లో టీమ్ఇండియా నాలుగో ర్యాంక్‌లో ఉండగా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

