
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా సౌకర్యం పొందేందుకు ఈ నెల 31తో గడువు పూర్తవుతున్నదని, ఈలోగా ప్రీమియంతోపాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని రాష్ట్ర బీమా నిర్దేశాలయం సంచాలకుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ బీమాశాఖ నిబంధనల ప్రకారం 58 ఏండ్లలోపు వయసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా ప్రీమియం చెల్చించి నిర్ణీత పత్రాలను సమర్పించాలని కోరారు. ఇప్పటివరకు 31 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని పేర్కొన్నారు.