AP News | అనంతపురం: అనంతపురం (Anantapur) జిల్లా కల్యాణదుర్గంలోని నార్త్ హైస్కూల్లో రామచంద్ర నాయక్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు రామచంద్ర నాయక్‌పై దాడి చేశారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడిని కల్యాణదుర్గం పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై నార్త్ హైస్కూల్ (North Highschool) ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయం జిల్లా విద్యాధికారి దృష్టికి వెళ్లడంతో ఘటనపై విచారణకు డీఈవో ఆదేశించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన నిజానిజాలు, పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.