హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి చెందిన 40 మంది టీచర్ల బృందం ఫిన్లాండ్లో పర్యటించనున్నది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ బృందం ఆ దేశంలో పర్యటించి అధ్యయనం చేయనున్నది. టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ టీచర్లను విదేశాలకు పంపించనున్నది.
తొలి బ్యాచ్లో రాష్ట్రం నుంచి 40 మంది టీచర్లను ఎంపికచేసింది. వీరిలో 34 మంది టీచర్లు, ఆరుగురు అధికారులు ఉన్నారు. ఈ బృందం శనివారమే ఫిన్లాండ్కు బయలుదేరనున్నది.