Tea History | సాయంకాలం ఛాయ్‌కి.. టీవీ సీరియల్స్‌కు ఉన్న అనుబంధం ఎంత గొప్పదో!
Tea History | ప్రాతఃకాలం పసందుగా మొదలయ్యేది ‘టీ’తోనే. సాయం సమయం కులాసాగా సాగేది తేనీటి సేవనంతోనే! ఉష్ణోదకం ఉందన్న అభయమే ఈ ఉభయ కాలాలనూ రోజులో మరపురానివిగా మార్చిందంటారు టీ ప్రేమికులు. ముఖ్యంగా పొద్దుగూకక ముందున్న టీ వేళను ప్రైమ్ టైమ్ కన్నా మిన్నగా భావిస్తుంటాయి ప్రసార మాధ్యమాలు.
Tea History | ప్రాతఃకాలం పసందుగా మొదలయ్యేది ‘టీ’తోనే. సాయం సమయం కులాసాగా సాగేది తేనీటి సేవనంతోనే! ఉష్ణోదకం ఉందన్న అభయమే ఈ ఉభయ కాలాలనూ రోజులో మరపురానివిగా మార్చిందంటారు టీ ప్రేమికులు. ముఖ్యంగా పొద్దుగూకక ముందున్న టీ వేళను ప్రైమ్ టైమ్ కన్నా మిన్నగా భావిస్తుంటాయి ప్రసార మాధ్యమాలు. ఆ సమయంలో ఇంటిల్లిపాదీ కలిసి వీక్షించే కార్యక్రమాలు ప్రసారం చేసి ‘టీ’ఆర్పీ రేటింగ్స్ దండుకుంటాయి. ఓ పాతికేండ్లు వెనక్కి వెళ్తే.. దూరదర్శన్‌లో ‘టీ టైమ్ మనోరంజన్’ పేరుతో హాస్య ధారావాహిక ప్రసారమయ్యేది.
స్టాండప్ కామెడీకి నిర్వచనం కూడా సరిగ్గా తెలియని 1994 ప్రాంతంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘టీ టైమ్’లో నవ్వులు పూయించింది ఈ కార్యక్రమం. స్టాండప్ కామెడీకి కింగ్‌గా పేరు సాధించిన రాజు శ్రీవాస్తవ్ ఈ ధారావాహిక ద్వారానే బుల్లితెరకు పరిచయమయ్యాడు. అప్రతిహతంగా నవ్వులు పూయిస్తూ సాయంకాలాన్ని సరదాకు కేరాఫ్‌గా నిలిపింది ఈ కార్యక్రమం. బుల్లితెర కోడలమ్మగా యావత్ భారతం మన్ననలు అందుకున్న స్మృతి ఇరానీకి సైతం ‘టీ టైమ్ మనోరంజన్’ పుట్టిల్లు కావడం విశేషం. 1996-99 మధ్యకాలంలో ‘వాసంత సమీరంలా.. నులివెచ్చని గ్రీష్మంలా..’ సాగిపోయిన రుతురాగాలు తెలుగువారిని పలకరించింది టీ టైమ్‌లోనే. సాయంత్రం 4.30 గంటలకు చక్కని చిక్కని టీ సేవిస్తూ ఈ సీరియల్లో లీనమైపోవడం ఇంటింటా కనిపించేది. ఆ సమయంలో దారిన పోతున్నవాళ్లకు ప్రతి ఇంటినుంచీ రుతురాగాలు టైటిల్ సాంగ్ వీనులకు విందు చేస్తే, దాంతోపాటూ గాలిలో తేలుతూ వచ్చే టీ పరిమళం అదనపు ఆనందాన్ని ఇచ్చేది. బహుశా తేనీటి సమయంలో ప్రసారమైన కారణంగా ‘రుతురాగాలు’ ఇప్పటికీ గుర్తుందన్న భావననూ తోసిపుచ్చలేం! ఏమంటారు?
శొంఠి టీ
కావలసినవి: టీ పొడి: రెండు టీ స్పూన్లు, పాలు: ఒక కప్పు, శొంఠి కొమ్ము: ఒకటి, మిరియాలు: పది, యాలకులు: రెండు, బెల్లం: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా శొంటి కొమ్ము, మిరియాలు, యాలకులు దంచుకొని మసాలా పొడి తయారు చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసుకొని అవి సెగ పట్టాక ఇందాక తయారు చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. టీ పొడి వేసి బాగా మరగనివ్వాలి. బెల్లం వేసి సన్నని మంటపై నాలుగు నిమిషాలపాటు మరిగించి మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి. చివరిగా పాలు పోసి మరోసారి వేడి చేసుకొని గ్లాసులోకి పోసుకుంటే శొంఠి టీ సిద్ధం.
టీకా తాత్పర్యం
ఈ సృష్టిలో నాకు నచ్చిన ఒకే ఒక పదార్థం తేనీరు.
జేన్ ఆస్టెన్ , ఆంగ్ల రచయిత్రి
Read More :
Mustache Tea Cup | మీసాల రాయుళ్ల కోసమే స్పెషల్ టీకప్పులు.. 18వ శతాబ్దంలో ఇవో సంచలనం!
Tea Tales | ఆడీ కారులో ఛాయ్ అమ్ముతున్న యువకులు.. త్వరలోనే బెంజ్ కారులో కూడా విక్రయిస్తారట!
Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

