ధర్మశాల: న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వన్డేల్లోకి వచ్చిన హెడ్ .. వచ్చీ రాగానే భారీ షాట్లతో చెలరేగిపోయాడు. వన్డేల్లో అతను నాలుగవ సెంచరీ నమోదు చేశాడు. హెడ్ సెంచరీలో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. హెడ్, వార్నర్లు తొలి వికెట్కు 175 రన్స్ జోడించారు. వార్నర్ 81, హెడ్ 109 రన్స్ చేసి పెవిలియన్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది.