మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : జాతీయస్థాయి టార్గెట్బాల్ టోర్నీలో తెలంగాణ విజేతగా నిలిచింది. 15 రాష్ర్టాలకు చెందిన 21 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా, బీహార్, తమిళనాడు తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. బాలికల కేటగిరీలో బీహార్ టాప్‌లో నిలువగా, తమిళనాడు, పంజాబ్‌కు రెండు, మూడు స్థానాలు లభించాయి. మునీరాబాద్ గ్రామ ఎస్కేఎం స్కూల్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ టార్గెట్బాల్ ప్రధాన కార్యదర్శి సోనుశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు వినోద్‌రెడ్డి, జిల్లా కోశాధికారి లవకుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.