400ఏండ్లచరిత్ర..
ఈ తారామతి బారదారికి దాదాపు 400 ఏండ్ల చరిత్ర ఉంది. గోల్కొండను పరిపాలన చేసిన రెండ నిజాం అప్పట్లో మూసీ నది పరివాహాక ప్రాంతంపై దీనిని నిర్మించారు. 7వ నిజాం సమయంలో ఈ తారామతి బారదారి అద్భుతమైన కట్టడంగా వెలుగులోకి వచ్చింది. నేటికీ ఆ కట్టడాలు చెక్కు చెదరకుండా ఉండడం, ఈ ప్రదేశంలో తెలంగాణ పర్యాటక శాఖ అద్భుతంగా మరిన్ని అందాలను జోడించడంతో చాలా మంది ఇక్కడి లొకేషన్లను చూసి ముగ్ధులవుతున్నారు. ఈ కట్టడం పర్సియన్ కళా నైపుణ్యంతో నిర్మించారు. ఇందులోకి అడుగుపెట్టగానే అక్కడి భవనాలు, పచ్చదనం మదిదోచుతుంది. అచ్చంగా రాజసాన్ని తలపించే అనుభూతినిస్తున్నది.
900ప్రీ వెడ్డింగ్షూట్లు..
ఈ తారామతి బారదారిలో ఈ సంవత్సరం దాదాపు 900 జంటలు ప్రీ -వెడ్డింగ్ ఫొటో షూట్లను జరుపుకున్నాయి. ఓ చారిత్రాత్మక ప్రదేశంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చిత్రీకరించుకుని తమ కొత్త జీవితానికి సరికొత్త అనుభూతిని పొందారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టి వేలాది లైక్స్ సాధించారు. అద్భుతమైన లొకేషన్లలో ఫొటో షూట్ నిర్వహించుకోవడం మరిచిపోలేని జ్ఞాపకమని కొత్త జంటలు మురిసిపోతున్నారు. విదేశాలలో ఉండే లొకేషన్లను మించి నగరంలోనే అద్భుత అందాలు ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నారు. తారామతి నృత్యం చేసిన స్మారక వేదిక నేటికీ అప్పటి అందాన్ని కోల్పోకుండా ఉండడం చాలా మంది ఆహూతులను కట్టిపడేస్తుంది.
చారిత్రక అద్భుతం
తారామతి బారదారి ఓ అద్భుతమైన, అందమైన చారిత్రాత్మక కట్టడం. దీని గొప్పతనాన్ని చెక్కుచెదరకుండా అన్ని హంగులను కల్పిస్తున్నాం. నగర వాసులతో పాటు చాలా మంది పర్యాటకులు ఈ కట్టడంలోని అందాలను తిలకిస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఇక్కడ ఈ ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లు చాలా పెరిగాయి. వారి కోసం అవసరమయ్యే తెలంగాణ టూరిజం తరఫును అన్ని సౌకర్యాలను అందిస్తున్నాం. ఇలా ప్రీ షూట్లు చేసుకునే వారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ను సంప్రదిస్తే ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తాం. ఫొటో షూట్ కోసం ఈ ప్రదేశంలో 4 గంటల సమయం వరకు అనుమతిస్తాం. ప్రతి రోజు ఈ తారామతి బరాదరీలో 5 ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతాయి. ఈ చారిత్రాకమైన ప్రదేశంలో ఇతర వేడుకలు జరుపుకునేందుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అధికారుల నెంబరు 8096307307కు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫేసుబుక్, ఇన్స్టాగ్రాం, ట్విటర్, తెలంగాణ టూరిజం వెబ్సైట్లలో సంప్రదించాలి.