Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Tehsildar Suspension | జిల్లాలో సర్ ప్రక్రియ కొనసాగుతుండగా, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన బోధన్, రుద్రూర్ మండలం తహసీల్దార్ బి.తారాబాయిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్ చేశారు.
రుద్రూర్ ( నిజామాబాద్ ) : జిల్లాలో సర్ ప్రక్రియ కొనసాగుతుండగా, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన బోధన్, రుద్రూర్ మండలం తహసీల్దార్ బి.తారాబాయి( Tehsildar Tarabhai ) ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్ ( Suspension ) చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సర్ ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల కమిషన్ విధుల్లో ఉన్న ఈఆర్వోలు, బీ ఎల్ఓలు, సూపర్వైజర్లను బదిలీ చేయవద్దని, సుదీర్ఘ సెలవులు మంజూరు చేయవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లోనూ భారత ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి ఉండగా తహసీల్దార్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
సర్ నోటీసుల జారీ విచారణ, క్లెయిమ్స్, పరిష్కారం వంటి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయకుండా ఈనెల 7 నుంచి 12 వరకు జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా గైర్హాజరైనందుకు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ఆమె ప్రధాన కార్యాలయం నిజామాబాద్ గా ఉంటుందని, కలెక్టర్ అనుమతి లేకుండా కేంద్రాన్ని విడిచిపెట్టి వెళ్లరాదని, ఎఫ్ ఆర్ 53 (1) ప్రకారం జీవన భృతి అందుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

