Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Chennai Metro | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) మహానగరంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతంచేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 (Metro Rail phase-2) లో భాగంగా నిర్మించిన పూనమల్లి-వడపళని (Poonamallee-Vadapalani) మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఇవాళ ప్రారంభించారు.
Chennai Metro : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) మహానగరంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతంచేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 (Metro Rail phase-2) లో భాగంగా నిర్మించిన పూనమల్లి-వడపళని (Poonamallee-Vadapalani) మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఇవాళ ప్రారంభించారు. ఈ మార్గం ప్రారంభం కోసం నగర వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
పోరూర్ బైపాస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పీఎం మోదీ, సీఎం విజయ్ జెండా ఊపి తొలి రైలు సర్వీసును ప్రారంభించారు. అనంతరం కొత్త మెట్రో రైలులో కలిసి ప్రయాణించారు. ఆ రైలులోని సౌకర్యాలను పరిశీలించారు. కారిడార్ 4లో భాగంగా సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో ఈ కొత్త మార్గాన్ని నిర్మించారు. 15 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో మొత్తం 11 ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు.
ముఖ్యంగా కొన్నిచోట్ల డబుల్ డెక్కర్ సెక్షన్‌ను నిర్మించడం ఈ మార్గం ప్రత్యేకత. అంతేకాకుండా భవిష్యత్తులో డ్రైవర్ అవసరం లేకుండానే రైళ్లను నడిపేందుకు వీలుగా ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది రైళ్ల రాకపోకలలో కచ్చితత్వాన్ని, భద్రతను పెంచుతుంది. ఈ కొత్త మెట్రో కారిడార్ అందుబాటులోకి రావడంతో చెన్నై పశ్చిమ శివారు ప్రాంతాలైన పూనమల్లి వంటి ఏరియాల నుంచి వడపళని వంటి నగర కేంద్ర ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కానుంది.
రోజూ ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ మార్గంలో ప్రయాణికుల కోసం సాధారణ సర్వీసులను కూడా ప్రారంభించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ కొత్త మెట్రో లైన్ చెన్నై నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

