Tamannaah Bhatia | మిల్క్ బ్యూటీ తమన్నా ఒకవైపు సినిమాల్లో హీరోయిన్గా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తూనే స్పెషల్ సాంగ్స్‌లో తన డ్యాన్స్‌తో మెరిసిపోతోంది. రీసెంట్గా వచ్చిన చాలా సినిమాలలో తమన్నానే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. దీంతో స్పెషల్ సాంగ్ అంటే తమన్నానే అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది ఈ భామ. ఏ పాటైనా సరే, తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ కట్టిపడేస్తోంది. అందుకే నిర్మాతలు స్పెషల్ సాంగ్ కోసం ముందుగా తమన్నానే సంప్రదిస్తున్నారు, ఆమె మ్యాజిక్ సినిమాకు మరింత ఆకర్షణను జోడిస్తుందని నమ్ముతున్నారు.
ఈ క్రమంలోనే తమ్ము బ్యూటీ బాలీవుడ్ నుంచి వస్తున్న రైడ్ 2 చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌లో నటించింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వాణికపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా నషా అనే ప్రత్యేక గీతంలో నటించి అలరించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట 24 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకొళ్తోంది.
అయితే ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనే చర్చ బాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్గా భారీ పారితోషికం అందుకునే ఈ మిల్క్ బ్యూటీ, స్పెషల్ సాంగ్స్ కోసం కూడా దాదాపు అదే స్థాయిలో వసూలు చేస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ‘నషా’ పాటలో తన అద్భుత డాన్స్‌తో మెరిసిన తమన్నా, ఏకంగా రూ.1 కోటి రెమ్యూనరేషన్ అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. కేవలం 5 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తమ్ము భారీగా డిమాండ్ చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.