Nijamsagar | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మంగుళూరు గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నిజాంసాగర్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. తమ గ్రామంలో వరి ధాన్యం ఆరబెట్టుకునేందుకు వరి ధాన్యం కల్లం ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు తహసీల్దార్ గతంలో ప్రజావాణిలో ఫిర్యాదులు చేశామని గ్రామంలోని సర్వే నంబర్ 165లో సుమారు 195 ఎకరాల భూమి ఉందని రైతులు తెలిపారు.
గ్రామంలో సుమారు 750 ఎకరాల్లో సాగు భూమి ఉండటంతో ప్రతీ సంవత్సరం వరి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సుమారు 7 నెలల కిందట తహసీల్దార్ కు రెండు నెలల కిందట కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలేదని వారు పేర్కొన్నారు. తమకు వెంటనే వారి ధాన్యం కల్లాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి మరో మారు వినతిపత్రం అందజేశారు.