Maremma | ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్.. మిస్టీరియస్ ఎద్దు మిస్సింగ్‌తో ఊరంతా కలకలం!
Maremma | మాస్ మహారాజ రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
Maremma | మాస్ మహారాజ రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, యాక్షన్ అంశాలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ విషయానికి వస్తే.. ఓ సంక్షోభంలో చిక్కుకున్న గ్రామస్తులు తమ గ్రామ దేవత మరెమ్మ తల్లిపై నమ్మకం పెట్టుకుంటారు. అయితే అమ్మవారికి సంబంధించిన పవిత్రమైన ఎద్దు అనూహ్యంగా కనిపించకుండా పోవడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలవుతాయి. ఆ ఎద్దు అదృశ్యం కావడం వెనుక ఏదో పెద్ద కారణం ఉందని గ్రామస్తులు భావిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో యువ కథానాయకుడిపై ఆ ఎద్దును వెతికి తీసుకురావాల్సిన బాధ్యత పడుతుంది.
ఎద్దు కోసం అతడు చేసే అన్వేషణ క్రమంలో ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. గ్రామంలో పాతుకుపోయిన నమ్మకాలు, స్థానిక రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు అతడి ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఈ క్రమంలో హీరో పలు హింసాత్మక సంఘర్షణల్లో చిక్కుకున్నట్లు ట్రైలర్లో చూపించారు.అయితే ‘మారెమ్మమ్మ’ కథలో అసలు మిస్టరీ ఏమిటన్నది మాత్రం ట్రైలర్లో పూర్తిగా రివీల్ చేయలేదు. పవిత్రమైన ఎద్దు ఎందుకు కనిపించకుండా పోయింది? దాని వెనుక ఎవరి హస్తం ఉంది? హీరో ఎదుర్కొనే సమస్యలకు, గ్రామ దేవత నమ్మకాలకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలను అలాగే ఉంచుతూ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు.
ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ఉత్కంఠభరితమైన సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని చేకూర్చింది. సాధారణ విలేజ్ డ్రామాకు భిన్నంగా దైవ విశ్వాసం, గ్రామీణ ఆచారాలు, మిస్టరీ, యాక్షన్ అంశాలను కలిపి కథను నడిపించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో దీపా బాలు కథానాయికగా నటించగా.. వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.ట్రైలర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచిన ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10, 2026న థియేటర్లలోకి రానుంది. గ్రామీణ నేపథ్యంలోని మిస్టరీ, యాక్షన్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

