Daayra | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరియు టాలెంటెడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘దైరా’. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ డీసీపీ అజూని కోహ్లీగా, పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్ కుమార్‌గా ప్రత్యర్థి పోలీసు అధికారులుగా కనిపించనున్నారు. చట్టం వర్సెస్ న్యాయం, నకిలీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన రామన్ కుమార్‌పై మరో పోలీసు అధికారి అజూని కోహ్లీ దర్యాప్తు చేసే తీవ్రమైన సన్నివేశాలతో ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. జంగ్లీ పిక్చర్స్ మరియు పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మేఘనా గుల్జార్ యదార్థ ఘటనల ఆధారిత సీరియస్ డ్రామాగా మలిచారు. సస్పెన్స్ మరియు హై-వోల్టేజ్ డ్రామాతో కూడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న విడుదల కానుండగా, ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది.