హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని (ఎకోసిస్టమ్‌ను) కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన టీహబ్ స్టార్టప్‌లకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి కేంద్రీకరింది. ఇందులో భాగంగా టీహబ్ కొత్త సీఈవో డాక్టర్ మహంకాళి శ్రీనివాసరావు టీ-ఫండ్ పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. నూతన ఆలోచనలతో వచ్చే ఔత్సాహిక స్టార్టప్స్‌ను ప్రోత్సహించి వాటి పురోగతికి చేయూతనివ్వడం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించవచ్చన్న ఆలోచనతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. తద్వారా స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టేవారిని ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు.