ముంబై: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టీ 20-టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలో జరుగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ఎలాగైనా జాక్పాట్ కొట్టాలని చూస్తున్న ప్లేయర్లు ఈ టోర్నీని వాడుకునేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి మొదలవుతున్న టోర్నీలో మొత్తం 38 జట్లు(105 మ్యాచ్లు) బరిలోకి ఉన్నాయి. వీటిని ఐదు డివిజన్లు చేయగా ఎలైట్-ఈ గ్రూపులో స్థానం పొందిన హైదరాబాద్..హర్యానా వేదికగా మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్ మెగా వేలం ముందు జరుగనున్న ముస్తాక్ అలీ టోర్నీలో రహానే, మయాంక్ అగర్వాల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీషా, పడిక్కల్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, రవి బిష్ణోయ్ ప్రత్యేక ఆకర్షణ నిలువనున్నారు.