– కోదాడ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన
కోదాడ, ఫిబ్రవరి 05 : న్యాయవాది స్వప్నను హత్య చేసిన దోషులను తక్షణమే శిక్షించాలని కోదాడ కోర్టులోని న్యాయవాదులు గురువారం తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య, మహిళా న్యాయవాది ధనలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. న్యాయాన్ని కాపాడే వారికే భద్రత లేకపోవడం దురదృష్టకరమన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దోషులను అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్షించాలన్నారు ఈ నిరసనలో న్యాయవాదులు ముల్క వెంకట్ రెడ్డి, రంగారావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, తమ్మినేని హనుమంతరావు, కరీం, నయీమ్, హుస్సేన్, చలం, రామ్ రెడ్డి, రంజాన్, భాష, దొడ్డ శ్రీధర్, రియాజ్, శ్రీనివాస్, అవినాష్, హేమలత, పాషా పాల్గొన్నారు.