Rakhi festival | అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా ఓ సోదరి బస్సు రోడ్డుపై ఆపి మరి తన సోదరుడికి రాఖీ కట్టి తన అనురాగాన్ని చాటుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి అక్క స్వప్న రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి రాఖీ కట్టింది. ఈ ఆత్మీయమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిన అక్క
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి రాఖీ కట్టిన అక్క స్వప్న
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క pic.twitter.com/7Lj6R3Daxn
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026