The Paradise | నాని ‘ది ప్యారడైజ్’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘యెష నాగుల’ సాంగ్ వచ్చేది అప్పుడే!
The Paradise | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise).
The Paradise | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సింగిల్ డిజిటల్ లాంచ్కు రంగం సిద్ధమైంది. ‘యెష నాగుల’ (Yesha Nagula) అంటూ సాగే ఈ పాటను రేపు అధికారికంగా విడుదల చేయనుండగా.. దానికి ముందుగా ఈరోజు సాయంత్రం ఈ సాంగ్ను అనిరుధ్ కన్సర్ట్లో పాడబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు శ్యామ్ లిరిక్స్ అందించగా.. జంగి రెడ్డి, సందీప్ కుమార్ ఆలపించారు. అలాగే సందీప్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం విశేషం.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలీ కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు.
The #YeshaNagula team 🔥🔥
They cooked 🎼💥💥An @anirudhofficial musical 🎼
Lyrics – @LyricsShyam
Singers – #JangiReddy, @sandeepkumwk7a
Choreography – @sandeepaata#TheParadise second single Digital launch on August 29th.GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.
Natural… pic.twitter.com/rSC3IRWGG0
— SLV Cinemas (@SLVCinemasOffl) August 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

