హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో ఓ యువతి అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో నిన్న రాత్రి గదిలో యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. యువతి, యువకులు ఐశ్యర్య, అషేర్ గతంలో పెద్దలకు తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం ఇరు కుటుంబాలు జంటను వేరుచేశాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఐశ్యర్యకు అషేర్ తెలిపాడు. కాగా ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఐశ్యర్య అషేర్ను ఒత్తిడి చేయగా అషేర్ ముఖం చేటేశాడు. దీంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా సమాచారం.