అమరావతి : విశాఖపట్నం హిందూస్థాన్ షిప్‌యార్డ్ కళాశాలలో అధికారులు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను నిలిపేశారు. ఈ మేరకు షిప్‌యార్డు కళాశాల విద్యార్థులకు సమాచారం అందించింది. అర్ధాంతరంగా తరగతులు నిలిపేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కళాశాల వద్దకు చేరుకున్న విద్యార్థులంతా తమ భవిష్యత్ ఏమిటంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా.. 2021-22 విద్యా సంవత్సరానికి కళాశాలలో 200 మంది ప్రవేశాలు పొందారు. కళాశాల ప్రకటనతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, తరగతుల నిలిపివేతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.