పురపాలక శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్‌రెడ్డి,
కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ
సూర్యాపేటలో పట్టణ ప్రగతి పనుల పరిశీలన
బొడ్రాయిబజార్, జూన్ 9 : సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి పనులను గురువారం జిల్లా కేంద్రంలో పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో డీ షిల్ట్ పనులను పరిశీలించారు.
4వ వార్డులోని జై భారత్ టౌన్షిప్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్‌వెజ్ బ్లాకులను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
వారి వెంట మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ ఉన్నారు.