Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Surprise Inspections | వినియోగదారులకు నిర్ణీత పరిమాణం కంటే తక్కువ తూకంతో సరుకులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు.
చుంచుపల్లి : వినియోగదారులకు నిర్ణీత పరిమాణం కంటే తక్కువ తూకంతో ( Defraud consumers ) సరుకులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూనికలు, కొలతల శాఖ ( Legal Metrology) అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని బాబుక్యాంప్, పెద్దబజార్ ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు ( Surprise Inspections ) నిర్వహించారు.
పట్టణంలోని పలు బియ్యం దుకాణాలు, కిరాణా, జనరల్ స్టోర్లలో తనిఖీలు చేపట్టారు. ప్యాక్ చేసిన బియ్యం బస్తాలను పరిశీలించి, బయట 26 కిలోల బరువుగా ముద్రించిన బస్తాలను ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేయగా, వాటిలో కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బస్తాపై కిలో చొప్పున కోత పెడుతూ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించిన అధికారులు, సంబంధిత ఆరు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు.
అనంతరం అధికారి కూచన మనోహర్ మాట్లాడుతూ.. వ్యాపారులు విక్రయించే ప్రతి ప్యాకింగ్ సరుకుపై నికర బరువును స్పష్టంగా ముద్రించాలని, బ్యాగుపై ఎంత బరువు పేర్కొంటే కచ్చితంగా అంతే పరిమాణంలో సరుకు ఉండాలని ఆదేశించారు. తూకాల్లో తేడాలు వచ్చినా, ముద్రణ నిబంధనలు పాటించకపోయినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వినియోగదారులు సైతం నిత్యావసరాలు, ప్యాక్ చేసిన సరుకులు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్ పై ముద్రించిన వివరాలను, నికర బరువును సరిచూసుకోవాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
IPE Director | ఐపీఈ డైరెక్టర్గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

