Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Metro RTC Pass | మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల విషయంలో కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గింది. గతంలో రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు కుదించింది. ఈ పాస్‌తో నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులకు అనుమతి ఉంటుంది.
Metro RTC Pass | మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రారంభంలో భారీ ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చిన కామన్ ట్రావెల్ పాస్‌పై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించడంపై సామాన్య ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధరతో పాస్ తీసుకోవడం కంటే విడివిడిగా టికెట్లు కొనుక్కోవడమే మేలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో ధరలపై పునఃసమీక్షకు దిగిన ప్రభుత్వం తాజాగా భారీగా తగ్గింపులు ప్రకటించింది.
అక్టోబర్ 2న హైదరాబాద్ మెట్రో, టీజీఎస్ఆర్టీసీ సంయుక్తంగా కామన్ ట్రావెల్ పాస్‌ను ప్రారంభించాయి. అప్పట్లో రోజువారీ పాస్ ధరను రూ.400గా, నెలవారీ పాస్ ధరను రూ.8,500గా నిర్ణయించారు. అయితే ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని, ప్రయాణికులపై అదనపు భారం పడుతుందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెలవారీ పాస్ ధరపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ధరలను సమీక్షిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ధరలను భారీగా తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు కుదించారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులకు అనుమతి ఉంటుంది. ధర తగ్గింపుతో ప్రయాణికులకు నెలకు రూ.4,500 ఆదా కానుంది.
రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను కూడా రూ.400 నుంచి రూ.275కు తగ్గించారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసుకోవచ్చు. దీంతో రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా కానుంది.
నవంబర్ 8 నుంచి కొత్త ధరలు
తగ్గించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెట్రో, ఆర్టీసీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, అధిక ధరలపై వ్యక్తమైన అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వం ధరలను సవరించడం గమనార్హం. ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

