Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
Indian Railways | దీపావళి పండుగ నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో బాణసంచా, పేలుడు పదార్థాలు, మండే స్వభావం కలిగిన వస్తువులను తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది.
Indian Railways | దీపావళి పండుగ నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో బాణసంచా, పేలుడు పదార్థాలు, మండే స్వభావం కలిగిన వస్తువులను తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణ దృష్ట్యా భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.
దీపావళి సందర్భంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్లు, రైళ్లలో నిరంతరం తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘా చర్యలను పెంచారు. బాణసంచా, మండే స్వభావం కలిగిన ద్రవ పదార్థాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర ప్రమాదకర వస్తువులను రైల్వే ప్రాంగణాల్లోకి తీసుకురావడం ప్రమాదకరమని రైల్వే అధికారులు హెచ్చరించారు.
రూ.1,000 జరిమానా.. మూడేళ్ల జైలు శిక్ష
నిషేధిత వస్తువులను రైళ్లలో రవాణా చేయడం రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 164 ప్రకారం శిక్షార్హమైన నేరమని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా రూ.1,000 జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ఈ రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రయాణికులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో అనుమానాస్పదంగా ఉన్న పేలుడు పదార్థాలు, మండే స్వభావం కలిగిన వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలోని రైల్వే అధికారులకు సమాచారం అందించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. రైల్వే సెక్యూరిటీ హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫోన్ చేయడంతో పాటు రైల్ మదద్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
పండుగ సమయంలో ప్రయాణాలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు రైల్వే సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించి సురక్షితమైన దీపావళిని జరుపుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఆకాంక్షించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
IPE Director | ఐపీఈ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతల స్వీకరణ
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

