e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News కొనుగోలు కేంద్రాలతో రైతన్నకు ‘మద్దతు’

కొనుగోలు కేంద్రాలతో రైతన్నకు ‘మద్దతు’

  • డీసీఎంఎస్‌, ఐకేపీ కేంద్రాల ద్వారా కేంద్రాలు
  • రైతులకు కలిసి వస్తున్న రవాణా ఖర్చులు
  • 30 రోజుల్లో ఖాతాల్లో ధాన్యం డబ్బులు

బషీరాబాద్‌, నవంబర్‌ 26: తెలంగాణ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ‘రైతుబంధు’ పథకం తీసుకొచ్చింది. రైతన్న ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదు కునేందుకు ‘రైతు బీమా’ పథకం అమలు చేస్తున్నది. అలాగే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి వారికి మద్దతు ధర కల్పిస్తున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి ధాన్యం సేకరిస్తున్నది. మండలానికి పది నుంచి 20 కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దళారుల జాడ కనిపించకుండా పోయింది. ధాన్యం కొనుగోలు చేసిన 30 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్‌, ఐకేపీ కేంద్రాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంతో పాటు, ఎక్కువగా ధా న్యం పండించే గ్రామాల్లో ఏర్పాటు చేయడంతో రైతులకు రవాణా ఖర్చుల భారం తగ్గింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకముందే రైతులు పం డించిన ధాన్యాన్ని 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న తాండూరుకు తరలించే వారు. దీంతో క్వింటాలుకు రూ. 80 నుంచి 100 వరకు రవాణా ఖర్చులు అయ్యేవి. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అనువైన చోట కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయ డంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, మద్దతు ధర లభిస్తున్నది.

మండలంలో ఆరు కేంద్రాలు

- Advertisement -

మండలంలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో దామర్‌చేడ్‌, మం తన్‌గౌడ్‌, నవంద్గి, డీసీఎంఎస్‌ వారి ఆధ్వర్యంలో కాశీం పూర్‌, మైల్వార్‌, మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నవల్గా గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర పెరిగింది. గ్రేడ్‌ ఎ రకానికి రూ. 1960, సాధారణ రకానికి 1940 ఉంది.

ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే రైతు పట్టా పాసు పుస్త కంతో పాటు, వీఆర్వో, వ్యవసా యాధికారి ధ్రువీకరణ పత్రం తీసుకరావాలి. 17 శాతం తేమ ఉన్న ధాన్యంతో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఇన్‌చార్జిని సంప్రదించాలి. అక్కడ ఉన్న ఇన్‌చార్జి కేం ద్రానికి ధాన్యం ఎప్పుడు తీసుకురావాలి అనే విషయం, తేదీ రాసి రైతుకు ఇస్తాడు. ఇన్‌చార్జి ఇచ్చిన తేదీ ప్రకారం కేంద్రానికి ధాన్యం తేస్తే అదే రోజు ధాన్యం కాంటా చేసుకుని రైతు ఇంటికి వెళ్లొచ్చు. ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించి సహకరించాలి.
-వెంకట్‌రాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సూచనలు పాటించాలి

ధాన్యం విక్రయించే రైతులు ప్ర భుత్వ సూచనలు తప్పక పాటిం చాలి. రైతులు తమ ఫోన్‌ నెం బర్‌ను ఆధార్‌కార్డు నెంబర్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ నెంబర్‌ కోసం ఫోన్‌ను రైతులు తమ వద్ద ఉండేలా చూసుకోవాలి. ఓటీపీ నెంబర్‌ వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల నుంచి ధ్రువీకరించుకోవాలి.

  • నాగంకృష్ణ, వ్యవసాయాధికారి

రవాణా ఖర్చులు తగ్గాయి

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అం దుబాటులో కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయడంతో రవాణా ఖర్చు లు తగ్గాయి. అంతేకాకుండా మద్దతు ధర లభిస్తు న్నది. ధాన్యంను కొనుగోలు చేయాలని దళారుల చుట్టూ తిరిగే బాధలు తప్పాయి. ఈ సంవత్సరం మద్దతు ధర పెంచడం రైతులకు సంతోషమైన విషయం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దళారుల చిరునామా కనిపించకుండా పోయింది.

  • లాలప్ప, రైతు, కొర్విచేడ్‌ గ్రామం
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement