Super Girl | డీసీ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ (Warner Bros Pictures) నుంచి వస్తున్న మరో సూపర్ హీరో చిత్రం ‘సూపర్ గర్ల్’ (Supergirl). ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఫేమ్ నటి మిల్లీ ఆల్కాక్ (Milly Alcock) ఈ చిత్రంలో సూపర్ గర్ల్‌గా నటించబోతుంది. ఈ సినిమాకు క్రెయిగ్ గిల్లెస్పీ (Craig Gillespie) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 26, 2026 న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ సినిమా ‘సూపర్‌మ్యాన్: ఉమెన్ ఆఫ్ టుమారో’ (Supergirl: Woman of Tomorrow) అనే కామిక్ ఆధారంగా రాబోతుండగా.. ‘కారా జోర్-ఎల్’ (Kara Zor-El) అలియాస్ సూపర్ గర్ల్ పాత్రలో నటిస్తుంది మిల్లీ ఆల్కాక్. ఇందులో కారా జోర్-ఎల్ 20 ఏళ్ల యువతిగా, సూపర్ గర్ల్ పవర్స్ ఉన్నప్పటికీ వాటిని సరిగా ఉపయోగించలేని విధంగా కనిపిస్తుంది. అయితే దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు తాను ఏ విధంగా ఆ సమస్యను ఎదుర్కోంది అనేది ఈ సినిమా కథ.