Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2’ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. డిసెంబర్ 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడి డిసెంబర్ 12న రిలీజ్ అయింది. అయితే రిలీజ్‌కి ముందు రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోల కోసం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే హైకోర్ట్ టిక్కెట్ రేట్స్ పెంచొద్దన్నా కూడా అధిక ధరలకి టిక్కెట్ విక్రయించడంతో నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఆదేశాలని బేఖాతరు చేస్తారా.. కోర్టు ధిక్కరణ చర్యలు మీపై ఎందుకు తీసుకోకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగా పెంచిన ధరలతోనే టిక్కెట్స్ అమ్మడం ఏంటని సింగిల్ బెంచ్ ఫైర్ అయింది. అసలు పెంచిన ధరలని ఆన్లైన్లో ఎందుకు అమ్ముతున్నారంటూ బుక్‌మై షోని ప్రశ్నించింది. ఇప్పుడు పెంచిన ధరలతోనే ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతున్నారా , అలా చేస్తే మీపై కూడా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబడుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆఖండ 2 సినిమా టిక్కెట్ ధరల పెంపుకి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై 14రీల్స్ సంస్థ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ పిటీషన్ పై మధ్యాహ్న 2:30 కు విచారణ జరగనుంది. ఆ విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇక అఖండ 2లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించి అలరించాడు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ అందించగా, నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని నేడు గ్రాండ్‌గా విడుదల చేసారు.