16 ఏళ్ల వయసులో బాలివుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంది. 90వ దశకంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో రాగేశ్వరి లూంబా ఒకరు. ఉత్తరాధిన ఈ బ్యూటీకి ఒకప్పుడు ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉండేది. తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంది. అన్యపాండే తండ్రి చంకీపాండే హీరోగా నటించిన అంఖేన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాగేశ్వరి ఓ ఊపు ఊపింది. ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత ‘మై ఖిలాడి తు అనారీ’లో నటించింది. ఈ సినిమా కూడా అప్పట్లో వండర్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సైఫ్ ప్రేయసిగా నటించిన ఈ బ్యూటీ అక్షయ్ కుమార్‌కు చెల్లెలిగా నటించింది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత.. ఈ బ్యూటీని చాలా మంది అక్షయ్ కుమార్ చెల్లెలిగానే గుర్తుపెట్టుకున్నారు. వీళ్లిద్దరి అన్న, చెల్లెలి కాంబినేషన్ కలిసింది అంత హిట్టయింది.

Rageshwari Loomba1
హీరోయిన్గా మాత్రమే కాదు సింగర్‌గా కూడా ఒక ఊపు ఊపింది రాగేశ్వరి. 90లలో ఈ బ్యూటీ పాటలకు శ్రోతలు పిచ్చెక్కిపోయేవాళ్లు. తన గాత్రంతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాంటి స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సడెన్‌గా సినిమాలకు దూరమైపోయింది. 2000 సంవత్సరంలో, ఈ బ్యూటీకి పక్షవాతం వచ్చింది. ఎడమ భాగం పూర్తిగా కదలకుండా అయింది. కొంత కాలం చికిత్స తీసుకుని మళ్లీ మాములు స్థితికి వచ్చింది.
అప్పట్లో రాగేశ్వరి లూంబా నటించిన సినిమాలు
Pratibha (1984)
Aankhen (1993
Aakhri Chetawani (1993)
Main Khiladi Tu Anari (1994)
Zid (1994)
Dil Kitna Nadan Hai (1997)
Tum Jiyo Hazaron Saal (2002)
Mumbai Se Aaya Mera Dost (2003)
Savi (2024)