‘ఇది కొత్త తరహా థ్రిల్లర్. ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మన సంస్కృతికి చెందిన అంశాలను, పాత్రలను సింబలైజ్ చేస్తూ ఈ సినిమా తీశారు’ అని హీరో సుమంత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకుడు. కె.హరీశ్ నిర్మాత. ఈనెల 31న విడుదల కానున్నది.
ఈ సినిమా ప్రీమియర్స్కి మంచి స్పందన రావడంతో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ‘యాక్షన్ రియాక్షన్ ఈవెంట్’లో సుమంత్ మాట్లాడారు. ఈ సినిమాలో థ్రిల్, ఎమోషన్, ఎైగ్జెట్మెంట్ అన్నీ ఉంటాయని దర్శకుడు రాజేశ్కర్ణ చెప్పారు. థ్రిల్లర్ జానర్లో కొత్తగా ఉండే కంటెంట్ ఇదని కథానాయిక నేహ తెలిపారు. ఇంకా నిర్మాత హరీశ్, నటులు రవివర్మ, త్రినాథ్, డీవోపీ వేదవ్యాస్ కూడా మాట్లాడారు.