Hunt Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Hunt Movie Teaser | ఫలితంతో సంబంధంలేకుండా కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్‌బాబు. అయితే ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి.
Hunt Movie Teaser | ఫలితంతో సంబంధంలేకుండా కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్‌బాబు. అయితే ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా మొదట పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఫుల్‌రన్‌లో బ్రేక్ ఈవెన్‌ను సాధించలేకపోయింది. ప్రస్తుతం సుధీర్‌బాబు కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘హంట్’ ఒకటి. మహేష్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన టీజర్ ఆధ్యంతం ఆసక్తి రేకిత్తిస్తుంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు గజిని తరహాలో గతం మర్చిపోయినట్లు తెలుస్తుంది. ఇక సుధీర్ ఈ మూవీలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలని అర్జున్ A, అర్జున్ Bగా వర్ణించారు. ‘అర్జున్ Aకి తెలిసిన మనుషులు, ఇన్సిడెన్సెస్, పర్సనల్ లైఫ్ ఇవేవి అర్జన్ Bకి తెలియవు. కానీ, అర్జున్ Aకి తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్,పోలీస్ ట్రైనింగ్ ఇవన్ని అర్జున్ Bకు కూడా ఉన్నాయి’ అనే డైలాగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్చేస్తున్నాయి. ‘ఏ కేసునైతే ఆ అర్జున్ సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అంటూ శ్రీకాంత్ పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌తోనే చిత్రబృందం ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశారు.
జిబ్రాన్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఇక సుధీర్‌బాబు మరోసారి కంటెంట్ సబ్జెక్ట్‌తో రానున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

