భారత్ ఓ ‘ఆకలి రాజ్యం’!
2026 సంవత్సరానికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ(ప్రపంచ ఆకలి సూచి)లో 122 దేశాలలో భారతదేశం 100వ స్థానంలో ఉంది.
- ప్రపంచ ఆకలి సూచీలో మనది 100వ స్థానం
- గడచిన 14 ఏండ్లుగా అదే స్థానంలో కొనసాగింపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: అభివృద్ధిలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీపడుతున్నట్టు, తృతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నట్టు ప్రకటించుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గడచిన 12 ఏండ్లుగా అధికారంలో సాగుతున్నప్పటికీ ఆకలి నిర్మూలనలో మాత్రం దేశంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 2026 సంవత్సరానికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ(ప్రపంచ ఆకలి సూచి)లో 122 దేశాలలో భారతదేశం 100వ స్థానంలో ఉంది.
ఈ సూచికను జర్మన్ సహాయ సంస్థ వెల్ట్హంగర్హిల్ఫ్(డబ్ల్యూహెచ్హెచ్), ఐరిష్ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, భాగస్వామ్య సంస్థలైన ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్, స్విస్ సంస్థ హెల్వటాస్లతో కలసి సంయుక్తంగా విడుదల చేశాయి. 24.1 స్కోరుతోభారత్ ఇప్పటికీ ‘తీవ్రమైన’ వర్గంలోనే కొనసాగుతున్నది. 2012 నుంచి దేశం ఈ వర్గం నుంచి బయటపడలేకపోయింది. సూచిక ప్రకారం జనాభాలో 9.8 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో 29 శాతం మంది ఎదుగుదల లోపంతో ఉన్నారు. ఇది చాలా అధిక శాతం. భారత్‌లోని పిల్లల్లో ‘వేస్టింగ్'(వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం) 19 శాతానికి పెరిగింది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం.
గతంతో పోలిస్తే ఇది 16.9 శాతం నుంచి పెరిగింది. ఆకలిని తగ్గించడంలో భారత్ సాధిస్తున్న పురోగతి మందగించింది. 2018 నుంచి 2026 మధ్య కాలంలో దీని స్కోరు 25.8 నుంచి 1.7 పాయింట్లు మాత్రమే మెరుగుపడింది. ఇది 2006 నుంచి 2012 మధ్య కాలంలో నమోదైన 8.2 పాయింట్ల మెరుగుదలతో పోలిస్తే చాలా తక్కువ. దక్షిణాసియా ప్రాంతం స్కోరు 23.5గా ఉండగా, ఇక్కడ పిల్లల్లో వేస్టింగ్ రేటు 15.8 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాల కంటే అత్యధికం. దక్షిణాసియాలో పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది(ప్రపంచ ఆకలి సూచి 23.5). అనేక దేశాల్లో గత కొన్నేళ్లుగా పురోగతి నిలిచిపోయింది. రెండు దేశాల్లో-ముఖ్యంగా పాకిస్థాన్‌లో 2018తో పోలిస్తే పరిస్థితి మరింత దిగజారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

