అడవి నేపథ్యంలో ‘సింగ’
హీరో గోపీచంద్ మరోసారి తనదైన మాస్ అవతారంలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
హీరో గోపీచంద్ మరోసారి తనదైన మాస్ అవతారంలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రం ద్వారా యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. మలయాళ నటి అనార్కలి నాజర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ యాభైశాతం పూర్తయింది.
ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ చేతిలో భారీ ఆయుధాన్ని ధరించి శక్తివంతంగా కనిపిస్తున్నారు. అడవి నేపథ్యంలో నడిచే కథాంశమిదని, ప్రత్యేకంగా నిర్మించిన ఫారెస్ట్ సెట్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించామని, డిసెంబర్లో తదుపరి షెడ్యూల్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, గోపీచంద్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: సామ్ సీఎస్, రచన-దర్శకత్వం: వి.వెంకట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

