ఫెస్టివల్ ఆఫ్ జాయ్ సంకల్పం అదే..
ప్రముఖ వ్యాఖ్యాత, నటి సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్' ఐదో వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
ప్రముఖ వ్యాఖ్యాత, నటి సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల, పద్మశ్రీ సునీత కృష్ణ అతిథులుగా విచ్చేచారు. ఈ కార్యక్రమం ద్వారా గత ఐదేళ్లుగా సుమ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల, విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమందికి మేలుస్తాయని ఉపాసనా కొణిదెల అభిప్రాయపడ్డారు.
కృతజ్ఞతాభావం, సేవా దృక్పథం సుమలో మెండుగా ఉన్నాయని, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమకు హృదయపూర్వక అభినందనలని సునీత కృష్ణ అన్నారు. సుమ కనకాల మాట్లాడుతూ ‘సునీత కృష్ణ, ఉపాసన లాంటి వారిని ప్రేరణగా తీసుకొనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. చిన్నప్పట్నుంచీ బాగా సంపాదించి, అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయాలనే ఆలోచన నాలో ఉండేది. ప్రజల ప్రేమ, ఆదరణ వల్లే నాకీ స్థాయి వచ్చింది.
వారు నాపై ఉంచిన నమ్మకాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చాలనే ఆలోచన నుంచే ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ పుట్టింది. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎంతోమంది దాతలు ఇందులో భాగస్వాములయ్యారు. దాతలకు, లబ్దిదారులకు నేను వారధిని మాత్రమే. ఈ సేవా ఉద్యమంలో మరింతమంది చేతులు కలపాలి. ఎంతోమందికి సాయం అందాలి. అందరి ఇళ్లలో వెలుగులు నిండాలి. ఇదే మా సంకల్పం’ అని పేర్కొన్నారు. ఇంకా రాజీవ్ కనకాల కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

