తుంగతుర్తి, సెప్టెంబర్ 28 : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్జీఎఫ్ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడలు మానసిక స్థిరత్వానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పాఠశాల దశలోనే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా ఆరు మండలాల నుండి విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీఆర్ఓ దూదిగాని సైదులు తన సొంత ఖర్చులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ సి ఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, పాఠశాల చైర్మన్ భాగ్యమ్మ, పీడీలు కొండగడుపుల యాకయ్య, చింతకుంట్ల అంబేద్కర్, ఆయా మండలాల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి : ఎంఈఓ లింగయ్య