గట్టుప్పల్, మార్చి 19 : విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివితే వారి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ భీమనపల్లి పారిజాత, మారయ్య, శ్రీరాములు, దుర్గయ్య, భీమనపల్లి రమేశ్, రిజ్వాన, హెచ్ఎం లింగయ్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు.