అంతరిక్షం నుండి వచ్చిన సునీత విలియమ్స్ త్వరగా కోలుకోవాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని సరస్వతి దేవాలయంలో పిసిఎన్జిల్స్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. త్వరగా సునీత విలియమ్స్ త్వరగా కోలుకోవాలని, అలాగే శుక్రవారం రోజు ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల కరస్పాండెంట్ మల్లేష్, డైరెక్టర్ తిరుపతి, ప్రిన్సిపల్ రఘు జీవన్ పూజలను నిర్వహించారు.
అలాగే బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతతో పాటు జిపిఏ సాధించేందుకు కృషి చేయాలని కోరుతూ బుధవారం సరస్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఎంఈఓ మనోరంజని, విద్యార్థులు పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.