పర్వతగిరి, నవంబర్ 10: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీ విద్యార్థులు జాతీయ సబ్‌జూనియర్స్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జనార్దన్ సోమవారం తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్చరీ క్రీడా సెలెక్షన్స్‌లో ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో వినయ్ రెండవ స్థానం, వినయ్ మూడో స్థానం సాధించగా, బాలికల కేటగిరీలో మానస తొలి స్థానంలో నిలిచింది.
బాలికల కాంపౌండ్ విభాగంలో దేవిలాల రెండవ స్థానం దక్కించుకుంది. ఈ నలుగురు ఆర్చర్లు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరుగబోయే సబ్ జూనియర్ నేషనల్స్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు. విజేతలను కల్లెడ స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాస్‌తో పాటు యాజమాన్యం అభినందించింది.