హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు (ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు.
బుధవారం హైదరాబాద్లో కార్యక్రమానికి సంబంధించి వాల్పేపర్లు ఆవిష్కరించారు. అనంతరం కే మణికంఠరెడ్డి, పీ లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), టీ నాగరాజు(ఎస్ఎఫ్ఐ), వెంకట్ స్వామి(ఎన్ఎస్యూఐ), పీ మురళి (ఏఐఎఫ్డీఎస్) మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.