కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా కుక్కలు దాడి చేయడంతో ఓ రైతుకు చెందిన దూడ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలోని రైతులు, పశువుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు
ఓదెల, అక్టోబర్ 11: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా కుక్కలు దాడి చేయడంతో ఓ రైతుకు చెందిన దూడ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలోని రైతులు, పశువుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. కుక్కల దాడిలో దూడ మృతి చెందడంతో రైతుకు ఆర్థిక నష్టం వాటిల్లింది.
కొలనూరులో వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతూ ఇటీవల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామానికి చెందిన దొడ్డె శంకర్ ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Calf
- Kolanuru
- Peddapalli
- Stray dogs
RELATED ARTICLES
తాజా వార్తలు
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

