20 దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లు
- ‘బయో’ వ్యర్థజలాల శుద్ధికి ప్రభుత్వం చర్యలు
- రూ. 68.31 కోట్లు విడుదల
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ దవాఖానల నుంచి వెలువడే వ్యర్థజలాలను (ద్రవ వ్యర్థాలను) శుద్ధి చేసేందుకు ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. దవాఖానల్లో వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను, వ్యర్థజలాలను ‘బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016’కు అనుగుణంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 దవాఖానల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణకు రూ. 68.31 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం పాలనాపరమైన ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో రూ. 52.59 కోట్లు ప్లాంట్ల ఏర్పాటుకు, మరో రూ.15.72 కోట్లు మూడేండ్లపాటు ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నిలోఫర్ దవాఖానలతోపాటు మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖనలు, ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

