హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఆయుర్వేద ఔషధగుణాలు ఉన్నట్టు పలు పరిశోధనల్లో వెల్లడైందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్డులో రూ.12 కోట్లతో నిర్మిస్తున్న నీరాకేఫ్‌ను రెండు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాకు ఒక నీరాకేఫ్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎక్సైజ్‌శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నగరవాసులకు స్వచ్ఛమైన కల్లును అందించడమే లక్ష్యంగా నీరాకేఫ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మద్యం అమ్మకాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. గత ప్రభుత్వాలు కల్లు దుకాణాలను మూసివేసి, గౌడ్లకు ఉపాధి లేకుండా చేశాయని విమర్శించారు. గౌడ కుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హరితహారంలో భాగంగా నాలుగు కోట్ల తాటిచెట్లు నాటినట్టు వివరించారు. నీరాకేఫ్ల ఏర్పాటును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతించారు. గతంలో చెన్నారెడ్డి కూడా నీరాకేఫ్లను ఏర్పాటుచేశారని చెప్పారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొన్నారు.