8 లక్షల కోట్లు పెరిగిన సంపద
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. దీపావళి పండుగ కంటే ముందే సూచీలు రివ్వున ఎగిశాయి. వరుసగా మూడోరోజూ సోమవారం సూచీ ఏకంగా రెండు శాతం వరకు లాభపడింది.
- భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 1,233, నిఫ్టీ 388 పాయింట్లు వృద్ధి
ముంబై, నవంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. దీపావళి పండుగ కంటే ముందే సూచీలు రివ్వున ఎగిశాయి. వరుసగా మూడోరోజూ సోమవారం సూచీ ఏకంగా రెండు శాతం వరకు లాభపడింది. దేశీయంగా అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడం, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు దిగిరావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి.
చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,233.25 పాయింట్లు లేదా 1.66 శాతం లాభపడి 75,692.78 వద్ద స్థిరపడింది. సెప్టెంబర్ 7 తర్వాత సూచీకి ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 387.70 పాయింట్లు లేదా 1.68 శాతం అందుకొని 23,440.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ కూడా ఐదు వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. దీంతో మదుపర్ల సంపర రూ.8 లక్షల కోట్ల మేర పెరిగింది. కార్పొరేట్ సంస్థల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుండటంతో ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి..దేశీయ స్థూల ఆర్థిక సూచీకలు కూడా సెంటిమెంట్‌ను మరింత ఊపునిచ్చాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
రిలయన్స్‌కు రిజల్ట్స్ కిక్కు
రిలయన్స్ మరో రికార్డును సొంతం చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.29,550 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడంతో కంపెనీ షేరు ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. సోమవారం కంపెనీ షేరు ఏకంగా 12 శాతం వరకు లాభపడింది. బీఎస్ఈలో కంపెనీ షేరు 11.64 శాతం లాభపడి రూ.1,299కి చేరుకున్నది. అటు ఎన్ఎస్ఈలోనూ సంస్థ షేరు 11.59 శాతం ఎగబాకి రూ.1,300కి చేరుకున్నది. ఏప్రిల్ 7, 2020 తర్వాత ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,83,298.24 కోట్లు ఎగబాకి రూ.17,57,876.78 కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

