ఎదులాపురం : ప్రజలు అందించే వినతుల ( Complaints ) పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah ) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ( Praja Vani ) ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
కలెక్టర్మాట్లాడుతూ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజావాణి లో 128 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, పెన్షన్, తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఉద్యమకారులు వినతిపత్రాన్ని ఉందించారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో చాకటి కిరణ్, సామ నాగరెడ్డి, ఎల్టీ సురేందర్ రెడ్డి, సయ్యద్ సుజాథ్ అలీ ఉన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.