హ్యూస్టన్, ఆగస్టు 27: అమెరికా పౌరులను వివాహం చేసుకున్న అక్రమ వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించాలనుకున్న బైడెన్ ప్రభుత్వ నిర్ణయానికి టెక్సాస్ కోర్టు బ్రేకులు వేసింది. అమెరికా పౌరులను వివాహం చేసుకున్న భారతీయులు సహా ఇతర దేశాల వారు, వారి పిల్లలకు పర్మినెంట్ రెసిడెన్సీ వేగంగా కల్పించాలని బైడెన్ ప్రభుత్వం జూన్లో నిర్ణయించింది. కనీసం పదేండ్లుగా అమెరికాలో నివసించే వారికి ఈ అవకాశం ఇవ్వాలనుకుంది. వీరికి అమెరికా పౌరసత్వం కూడా వేగంగా కల్పించాలని ప్రభుత్వం భావించింది. అయితే, టెక్సాస్ జిల్లా జడ్జి జే కాంప్బెల్ బార్కర్ సోమవారం ఈ నిర్ణయంపై రెండు వారాల పాటు స్టే విధించారు. ఈ నిర్ణయం వేల మంది ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపనుంది.