టోక్యో, ఫిబ్రవరి 9: అది 2017.. మైకేల్ రొకాటీ అనే వ్యక్తి మోటార్ బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెన్నెముకకు గాయమై అతడి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఇక జీవితంలో నడవలేననుకొన్నాడు. కానీ, ఇప్పుడు మునుపటిలాగే నడవగలుగుతున్నా డు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తయారుచేసిన స్పైనల్ కార్డ్ ఇంప్లాంట్ అతడిని పూర్వస్థితికి తీసుకొచ్చింది. ఈ ఇంప్లాంట్.. మెదడులా కండరాలకు సిగ్నల్ చేరవేసి విద్యుత్తు స్పందనలు కలిగిస్తుంది. తద్వారా అతడు మునుపటిలా నడవగలిగాడు. వెన్నెముక సమస్యతో నడవలేని వాళ్ల కోసం శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు.