Euphoria Glimpse | టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) కాంపౌండ్ నుంచి సోషల్ డ్రామా ప్రాజెక్ట్ యుఫోరియా (Euphoria). హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే షార్ట్ టైటిల్ వీడియోను విడుదల చేశారని తెలిసిందే. డ్రగ్స్ తీసుకున్న యువతి ఆ మత్తులో మెట్రో ట్రైన్‌లోకి వచ్చి..తనేం చేస్తుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయిన విజువల్స్‌తో కట్ చేసిన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ను అందరితో షేర్ చేసకుంది గుణ శేఖర్ అండ్ టీం. ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోషిస్తున్న జయదేవ్ నాయర్ పాత్ర లుక్‌ను షేర్ చేశారు. జయదేవ్ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పనప్పటికీ.. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టు పోస్టర్ హింట్ ఇచ్చేస్తుంది.
యువత మత్తు పదార్థాల మోజులో పడటం ఎలాంటి పర్యావసానాలకు దారితీసిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గుణ శేఖర్ ఇప్పటికే గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో భూమికా చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. గుణశేఖర్ తన కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త కథాంశంతో సమకాలీన సామాజిక సమస్యలతో యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా యుఫోరియా రాబోతుంది.
Introducing the versatile @menongautham as dynamic ‘Jayadev Nair’ from #EuphoriaTheFilm ❤🔥
Catch him bringing layers of intrigue and depth to this key role! 💥@Gunasekhar1 @bhumikachawlat @neelima_guna @kaalabhairava7 @vigneshreddy_g @LYalamanchili28 @GunaHandmade… pic.twitter.com/oPVWsjdxTI
— BA Raju’s Team (@baraju_SuperHit) May 28, 2025
యుఫోరియా గ్లింప్స్..