తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం, ఏడుకొండల్లో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొందరు తిరుపతి నుంచి తిరుమల(Tirumala)కు బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తుండగా మరికొంత మంది అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకుంటున్నారు. భక్తుల రాకతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshanam) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 64,635 మంది దర్శించుకోగా 19,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు తమ మొక్కుల ద్వారా హుండీలో వేసిన కానుకల వల్ల టీటీడీ(TTD) కి రూ. 4.64 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
రేపు డయల్ యువర్ ఈవో
డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా తెలుపవచ్చని అన్నారు. భక్తులు 0877-2263261 అనే నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.