హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికే ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. హిల్ట్ పాలసీ వల్ల జరిగే నష్టాల గురించి యువతను చైతన్యపరుస్తామని, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఐక్య విద్యార్థి సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
సమావేశంలో బీఆర్‌ఎస్వీతోపాటు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ(వీ), పీడీఎస్‌యూ(జీ), ఎంఎస్ఎఫ్(వీ), టీజీఎస్ శక్తి, ఆదివాసీ విద్యార్థి సంఘం, బీసీ విద్యార్థి జేఏసీ, డీబీఎస్ఏ, ఏఎంఎస్ఏ, టీవీఎస్, ఆర్ఎస్ఏ, టీఎస్‌యూ, ఎస్ఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటారని, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.